Manu Bhaker : ఖేల్ రత్న అవార్డు నామినేషన్ వివాదం.. మనుబాకర్ కీలక వ్యాఖ్యలు

అవార్డులు తన గోల్ కాదని భారత షూటర్ మను బాకర్ అన్నారు.

Update: 2024-12-24 13:38 GMT

దిశ, స్పోర్ట్స్ : అవార్డులు తన గోల్ కాదని భారత షూటర్ మను బాకర్ అన్నారు. ఖేల్ రత్న నామినేషన్ల వివాదంపై తొలిసారి ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘అథ్లెట్‌గా దేశం తరఫున ఆడటమే నా లక్ష్యం. అవార్డులు స్ఫూర్తినిచ్చినా.. అవే నా జర్నీని నిర్దేశించలేవు. నా నామినేషన్ ప్రక్రియలో సమస్యను గుర్తించి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అవార్డుతో సంబంధం లేకుండా దేశం కోసం మరిన్ని పతకాలు సాధించడానికి ప్రయత్నిస్తాను. ఈ విషయంలో ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దు.’ అని బాకర్ అన్నారు. క్రీడా మంత్రిత్వ శాఖ ఈ విషయమై స్పందిస్తూ.. ‘రెండు రోజుల్లో అవార్డుల నామినేషన్ ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తాం. కేంద్ర మంత్రి అప్రూవల్ తర్వాత తుది జాబితా వెలువడుతుంది. క్రీడా శాఖ మంత్రితో నేడు(బుధవారం) కమిటీ భేటీ కానుంది.’ అని స్పష్టం చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మనుబాకర్ రెండు కాంస్య పతకాలు సాధించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మనుబాకర్ నిలిచిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News