AV Ranganath : గూగుల్ మ్యాప్స్ ద్వారా బఫర్ జోన్ల సమాచారం : రంగనాథ్
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(HYDRA Commissinor AV Ranganath) మంగళవారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు.
దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(HYDRA Commissinor AV Ranganath) మంగళవారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. చెరువుల, కుంటల ఎఫ్టీఎల్(FTL) పరిధి వివరాలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఇకపై చెరువుల బఫర్ జోన్ల(Buffer Zones) వివరాలను గూగుల్ మ్యాప్స్(Google Maps) ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. హైడ్రా ఏర్పాటుకు ముందు తీసుకున్న అనుమతులు చెల్లుతాయి. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని అన్నారు. ఎఫ్టీఎల్ లో నివాసం ఉంటున్న భవనాలను కూల్చబోమని తెలియజేశారు. ఓఆర్ఆర్ లోపలే హైడ్రా పరిధి ఉందని.. త్వరలోనే దీని పరిధి విస్తరించే అవకాశం ఉందన్నారు. పార్కుల కబ్జాలపై వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలియజేశారు.