'సెలూన్ల నిర్వహణకు 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ'
దిశ, కరీమాబాద్(వరంగల్ టౌన్): నాయీ బ్రాహ్మణులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు.
దిశ, కరీమాబాద్(వరంగల్ టౌన్): నాయీ బ్రాహ్మణులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. ఓరుగల్లు నాయీ బ్రాహ్మణ సహకార సంఘం మొదటి వార్షికోత్సవ మహాసభ మంగళవారం పోచమ్మ మైదాన్‌కు సమీపంలోని ఎస్ఎస్‌కే ఫంక్షన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు మాజీ మేయర్ గుండా ప్రకాష్, రాజనాల శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ.. నాయీ బ్రాహ్మణుల సెలూన్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందజేస్తోందని అన్నారు. అనంతరం నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కస్తూరి సతీష్ మాట్లాడుతూ.. మొదటి వార్షికోత్సవ సమావేశంలో సుమారు 300 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్రను ఆహ్వానించినా.. కొన్ని అనివార్య కారణాలతో రాలేకపోయారని తెలిపారు. నాయీ బ్రాహ్మణ సంఘానికి ఆయన ఆప్యాయతతో తోడ్పాటును అందజేస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పరమేశ్వర్, భిక్షపతి, శ్యామ్ సుందర్, కృష్ణ, రాజు, వెంకటేశ్వర్లు, మధుసూదన్, నవీన్, ప్రశాంత్, వినయ్‌తో పాటు నాయీ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.