జంతువులను అలానే వధించండి.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: జంతువులను వధించే విషయంలో ప్రతి ఒక్కరు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ
దిశ, వెబ్‌డెస్క్: జంతువులను వధించే విషయంలో ప్రతి ఒక్కరు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరు జంతువులను వధించే ముందు ఈ జాగ్రత్తలు పాటించాలంటూ కీలక సూచనలు చేసింది కర్ణాటక ప్రభుత్వం. మాంసం కోసం జంతువులను వధించే ముందు వాటిని కచ్చితంగా స్టన్ (స్పృహ లేకుండా) చేయాలని కర్ణాటక పశుసంవర్ధక మరియు పశు వైద్య సేవల విభాగం కోరింది. అంతేకాకుండా బృహత్ బెంగళూరు మహానగర పలికే (బీబీఎంపీ) వారు లైసెన్సులు ఇచ్చేముందు స్టన్నింగ్ ఫెసిలిటీని చెక్ చేయాలని తెలిపారు. అయితే 'హలాల్' వివాదం సందర్భంగా ఈమేరకు సూచనలు జారీ అయ్యాయి.