Delhi : ఢిల్లీలో తీవ్ర నీటి కొరత.. ఆ లెవల్స్ పెరగడమే కారణం

దేశ రాజధానిలో అనేక చోట్ల నీటి కొరత ఏర్పడింది.

Update: 2024-12-23 16:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధానిలో అనేక చోట్ల నీటి కొరత ఏర్పడింది. వజిరాబాద్ సమీపంలోని యుమునా నదిలో అమ్మోనియా లెవల్స్ భారీ స్థాయికి చేరుకోవడమే దీనికి కారణమని ఢిల్లీ జల మండలి సోమవారం ప్రకటించింది. అమ్మోనియా సాంద్రత 5.0పీపీఎం ఉండటం వల్ల వజీరాబాద్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో నీటి ఉత్పత్తి 25-50 శాతం తగ్గింది. దీంతో ప్రజలు నీటిని జాగ్రత్తగా వినియోగించాలని ఢిల్లీ జల మండలి కోరింది. డిమాండ్ ఉన్న చోట నీటి ట్యాంకర్లను పంపుతామని తెలిపింది. యుమునా నదిలో అమ్మోనియా కాలుష్యం గత కొన్ని రోజులుగా సమస్యగా మారింది. తరచూ నీటి సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.


Similar News