కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తున్నారా? మానుకుంటేనే లాభం!

దిశ, ఫీచర్స్ : ఇటీవల కాలంలో చాలామంది పెట్ లవర్స్‌ తమ పెంపుడు జంతువులను కన్నపిల్లల్లా చూసుకుంటున్నారు

Update: 2022-04-04 08:26 GMT

దిశ, ఫీచర్స్ : ఇటీవల కాలంలో చాలామంది పెట్ లవర్స్‌ తమ పెంపుడు జంతువులను కన్నపిల్లల్లా చూసుకుంటున్నారు. రెగ్యులర్ హెల్త్ చెకప్స్‌తో పాటు వ్యాక్సినేషన్ కూడా చేయిస్తున్నారు. అంతేకాదు శునకాల యజమానులు వాటిని డైలీ వాకింగ్‌కు తీసుకెళ్లడాన్ని గమనించే ఉంటారు. కానీ ఇలా ప్రతీ రోజు కుక్కతో వాకింగ్‌కు వెళ్లడం మంచి ఆలోచన కాకపోవచ్చని ఫ్రాన్స్‌కు చెందిన డాగ్ ట్రైనర్, 'స్టాప్ వాకింగ్ యువర్ డాగ్' పుస్తక రచయిత నికీ అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆమె ఎందుకలా చెబుతోంది?

జంతు ప్రేమికురాలైన నికీ.. కొన్నేళ్ల కిందటే డాగ్ ట్రైనర్‌గా మారి, శునకాల ప్రవర్తనను దగ్గరి నుంచి పరిశీలించింది. ఈ క్రమంలోనే కుక్కలను వాకింగ్‌కు తీసుకుపోవడం వల్ల వాటికి ఎలాంటి ప్రయోజనముండదని పేర్కొంది. ఇందుకు గల కారణాలను వివరిస్తూ ఆమె 'స్టాప్ వాకింగ్ యువర్ డాగ్' అనే పుస్తకాన్ని విడుదల చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. వాకింగ్‌కు బదులు కుక్కలను గేమింగ్ యాక్టివిటీతో ఎంగేజ్ చేయాలని సూచించింది. తాను పెంచుకుంటున్న కుక్క విషయంలోనూ ఇవే పద్ధతులు అనుసరించి ఫలితాలు సాధించినట్లు తెలిపింది. దీనివల్ల అవి ప్రశాంతంగా ఉండటమే కాక హ్యాపీగా జీవిస్తాయని వెల్లడించింది. ఈ విషయాలపై అవగాహన పెంచేందుకు ఏప్రిల్ 2 నుంచి 'డోంట్ వాక్ యువర్ డాగ్ డే'ను ప్రారంభించినట్లు పేర్కొంది.

'టీకాలు వేయని కొత్త కుక్క పిల్లలు, అనారోగ్యంగా ఉన్న కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లడం మంచిది కాదు. వాటిలో అవసరమైన నైపుణ్యాలు, సంబంధాలను పెంచేందుకు ఇంట్లో గేమింగ్ యాక్టివిటీస్ పెంచడమే గొప్ప మార్గం. ఈ మేరకు శాండ్‌పిట్స్ తవ్వడం, కార్డ్‌బోర్డ్ పెట్టెలతో ఆడుకోవడం, లిక్ మ్యాట్స్ ఉపయోగించడం, దాగుడు మూతలు వంటి గేమ్స్‌పై దృష్టి సారించాం. మీరు కూడా 'డోంట్ వాక్ యువర్ డాగ్ డే'లో పాల్గొనాలనుకుంటే #dontwalkyourdog హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్‌లో మీ అనుభవాలు పంచుకోవచ్చు' అని నికీ తెలిపారు.

Tags:    

Similar News