SEBI: ఏథర్ సహా ఆరు ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్..!
ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లోకి(Stack Market) ఎంట్రీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లోకి(Stack Market) ఎంట్రీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ కోసం సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఏథర్(Ather) సహా ఆరు కంపెనీల ఐపీఓకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(SEBI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు గత సెప్టెంబర్ లో సెబీకి దరఖాస్తు(Apply) చేసుకోగా.. తాజాగా ఆమోదం తెలిపింది. ఇందులో ఏథర్, ఓస్వాల్ పంప్స్, క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, స్లోస్ బెంగళూరు, ఇన్ఫోసొల్యూషన్స్ లిమిటెడ్, ఫ్యాబ్ టెక్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా లీల ప్యాలెస్ హోటల్స్, రిసార్ట్స్ నిర్వహణ సంస్థ స్లోస్ బెంగళూరు(Slows Bangalore) ఐపీఓ ద్వారా రూ. 5,000 కోట్లను సమీకరించనుంది. ఇందులో రూ. 3 వేల కోట్లను తాజాగా షేర్ల ద్వారా సేకరించనున్నారు. ఇక ఏథర్ ఎనర్జీ రూ. 3,100 కోట్లను మార్కెట్ నుంచి సమీకరించినుంది. ఈ నిధుల్ని మహారాష్ట్రలో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం, లోన్స్ పే చేయడానికి, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.