Winter: చలికాలంలో చర్మం ఎందుకు పగులుతుంది.. కారణాలివే?

సాధారణంగా చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు తలెత్తుతాయి.

Update: 2024-10-27 09:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు తలెత్తుతాయి. చలి ప్రభావం ముందుగా తెలిసేది చర్మానికే. చర్మం పొడిబారుతుంది. స్కిన్ మెరుపు కోల్పోతుంది. చలికాలంలో కేవలం చర్మానికే కాదు జుట్టు సమస్యలు కూడా వస్తాయి. తలలో చుండ్రు తయారై.. అధిక మొత్తంలో హెయిర్ ఫాల్ అవుతుంది. అయితే తాజాగా చలికాలంలో చర్మం పగుళ్లకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు నిపుణులులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వింటర్‌లో పగుళ్లకు కారణాలు..

పొడి గాలులు, చలి కారణంగా స్కిన్ తేమ తగ్గిపోతుంది. అలాగే చల్లని వాతావవరణం కారణంగా వాటర్ తక్కువగా తీసుకుంటారు. దీంతో స్కిన్ డిహైడ్రేట్ అవుతుంది. వేడి వాటర్ తో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ తేమ తొలగిపోతుంది. పొడి చర్మంపై కఠినమైన రసాయనాలను యూజ్ చేయడం వల్ల స్కిన్ మరింతగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. విటమిన్, ఎ, సి, సి, డి లోపం వల్ల కూడా స్కిన్ పగులుతుంది. అలాగే చల్లని గాలి స్కిన్ నుంచి తేమను పీల్చుకుంటుంది. తద్వారా స్కిన్ పొడిగా మారుతుంది. బలహీనంగా తయారవుతుంది.

చలికాలంలో చర్మం మృదువుగా ఉండాలంటే..?

కాగా చలికాలంలో చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడం చాలా అవసరం. దీనికోసం ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్ కొన్ని చుక్కలను స్నానం చేసే నీటిలో కలపాలి. లేదా స్నానం చేసిన తర్వాత ఈ నూనెలను చర్మానికి రాసుకోవాలి. లేదా స్నానం చేసే నీటిలో కొన్ని పాలు కలిపినా కూడా చర్మం మృదువుగా ఉంటుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News