‘పుష్ప 2’ లో నటించడానికి రష్మిక తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? శ్రీవల్లి మంచి ఫామ్‌లో ఉందిగా
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ఇక సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ‘యానిమల్’ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’లో నటిస్తోంది.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ భారీ రెస్పాన్స్ అందుకుంది. కాగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో రష్మిక మందన్నకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో ఎంతగా మెప్పించిందో మనందరికీ తెలిసిందే. ఇక పుష్ప 2లో కూడా అంతే అలరించడానికి వచ్చేస్తోంది ఈ బ్యూటీ. అయితే ఈ సినిమాకు రష్మిక ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇదే విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read More..