Bellamkonda Sai Srinivas: భైరవం నుంచి మరో అప్‌డేట్.. వరుస పోస్టులతో కిక్ ఇస్తున్న చిత్ర బృందం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohit) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భైరవం’ (Bhairavam).

Update: 2024-11-15 09:41 GMT

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohit) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భైరవం’ (Bhairavam). విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి.. మూవీలో యాక్ట్ చేస్తున్న నటీనటులకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వారి పాత్రలు రివీల్ చేస్తూ విడుదల చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌కు నెట్టింట విశేషమైన స్పందన లభిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లతో పాటు.. తమిళ నటి అతిధి శంకర్ (Aditi shankar) ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో నటి పాత్రను రివీల్ చేశారు చిత్ర బృందం.

ఈ మేరకు నటి దివ్యా పిళ్లై (Divya Pillai) క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘ప్రతిభ గల నటి దివ్యా పిళ్లైను పరిచయం చేస్తున్నాం. ‘భైరవం’ మూవీలో ఈ బంగారు బొమ్మ ‘పూర్ణిమ’ గా మీ ముందుకు రాబోతోంది. ఆమె తన నటనతో మీ అందరినీ ఆశ్చర్యపరచడానికి సిద్ధంగా ఉంది. తదుపరి అప్‌డేట్ కోసం వేచి ఉండండి’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో దివ్యా పిళ్లై అచ్చమైన తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా.. దివ్యా పిళ్లై ‘మంగళవారం’ చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్‌లో కనిపించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..