తలసరి ఆదాయంలో మూడోస్థానంలో దేశ రాజధాని
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ 2021-22 ఆర్థిక - Delhi Ranks 3rd In Per Capita Income, Behind Sikkim, Goa: Economic Survey
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ 2021-22 ఆర్థిక సర్వేలో కీలక విషయాలు వెల్లడించింది. తలసరి ఆదాయంలో సిక్కిం, గోవా తర్వాత ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. చివరి ఆరేళ్లలో ఢిల్లీ జీడీపీ 50 శాతం పెరిగి రూ.6,16,085 కోట్ల నుంచి రూ.9,23,967 కోట్లకు చేరిందని తెలిపింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శుక్రవారం అసెంబ్లీలో ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సర్వే ప్రకారం 'ఢిల్లీ తలసరి ఆదాయం 16.81శాతం పెరిగి రూ.4,01,982గా ఉంది. ఆ సమయంలో ధరలతో పోలిస్తే 2021-22 లో తలసరి ఆదాయం 16.81శాతం పెరిగింది. ఇక రాష్ట్రాలు, కేంద్రపాలిత పరంగా ఢిల్లీ 3వ స్థానంలో ఉంది' అని సర్వే వెల్లడించింది. ఇక ఢిల్లీ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి 2021-22 లో ఏకంగా 17.65శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. కాగా, ఇదే ఏడాదికి గానూ ఢిల్లీ రూ.1,450 కోట్ల రెవెన్యూ మిగులు కలిగి ఉంది.