దళిత బంధు నీరుగార్చే విధంగా ఉందంటూ జాతీయ రహదారిపై దళితుల ఆందోళన..

దిశ, వర్థన్నపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధ..latest telugu news

Update: 2022-03-12 13:11 GMT

దిశ, వర్థన్నపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టింది. అయితే కొంత మంది వ్యక్తుల హస్తంతో ప్రభుత్వ లక్ష్యానికి నీరుగార్చే విధంగా ఉందని దళితులు మండిపడుతున్నారు. శనివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని దళితులు వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు.

దీంతో జాతీయ రహదారిపై ఇరువైపుల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆందోళనకారులు వినకపోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ బంధులో 50 మంది అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తూ.. అర్హులైన వారికి అన్యాయం చేస్తున్నారని దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ సమస్యను ఎవరూ పరిష్కరిస్తారో చూడాలి.

Tags:    

Similar News