ధరణి పోర్టల్‌తో దళితుల భూములు స్వాహా
టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి దళితుల భూములను స్వాహా చేస్తున్నదని ఏఐసీసీ కార్యక్రమాల
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి దళితుల భూములను స్వాహా చేస్తున్నదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ సారధ్యంలో భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రాం వరకు జరుగుతున్నసర్వోదయ సంకల్ప పాదయాత్రలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. భూ సమస్యలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.
టీఆర్ఎస్ పాలనలో దళితులు, గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ధరణి పోర్టల్ తెచ్చి దళితులు, గిరిజనులు, పేదల భూములను లాక్కోవడం తగదన్నారు. భూదానోద్యమ పితమహుడు ఆచార్య వినోభభావే స్పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. టీఆర్ఎస్పార్టీ చేస్తున్న నష్టాలను ప్రజలకు స్పష్టంగా వివరిస్తూ గద్దె దించుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.