కారు చీకట్లో కాంట్రాక్టు పనులు.. కనీసం వారికి కూడా తెలియకుండా..
దిశ, ఖిలా వరంగల్: కిలా వరంగల్ ఉద్యమాలకు పెట్టింది పేరు. ఇక్కడ నిజాం కాలం నుండే- latest Telugu news
దిశ, ఖిలా వరంగల్: కిలా వరంగల్ ఉద్యమాలకు పెట్టింది పేరు. ఇక్కడ నిజాం కాలం నుండే మహిళలు బతుకమ్మ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఆడిపాడి ఎంతో ఘనంగా జరుపుకునే వారు. ఇక్కడ బతుకమ్మ ఆడటానికి కొంత ప్రత్యేక ఆటస్థలం ఉంది. ఈ ఆట స్థలంలో చాలా సంవత్సరాలుగా రాణి రుద్రమదేవి బతుకమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చందాలు వసూలు చేసుకుని.. బతుకమ్మ ఆట స్థలాన్ని ప్రతి సంవత్సరం ముస్తాబు చేసి మహిళకు అందించేవారు. ఈ ఆట స్థలంలో 4 డివిజన్ల దాదాపు 30 వేల మంది మహిళలు బతుకమ్మ ఆట ప్రతి సంవత్సరం ఆడుతుంటారు. దీన్ని గుర్తించిన అధికారులు ఈ ఆట స్థలంకు ఒక ఎకరం 33 గుంటల భూమిని కేటాయించారు. కొన్ని సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఫండ్ తోనే ఆట స్థలము శుభ్రం చేసి లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
కానీ.. ఈ రోజు రాత్రికి రాత్రే, కనీసం ఇక్కడి ప్రజాప్రతినిధులకు తెలవకుండా, కమిటీకి తెలియకుండా అభివృద్ధి కార్యక్రమాలు అంటూ.. 80 లక్షల ఫండ్‌తో ఇరిగేషన్ కాంట్రాక్టు వారు పనులు ప్రారంభించారు. ఇలా ఎవరికి తెలియకుండా అభివృద్ధి పనులు చేయడానికి వెనకాల ఉన్న అసలు కారణం ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఈ ప్రాంత 42వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మను అడగగా.. తమకు కూడా ఎలాంటి సమాచారం లేదు పనులు ఆపండని ఆదేశించారు. కానీ, కాంట్రాక్టర్ కార్పొరేటర్ మాటలు కూడా పట్టించుకోకుండా అర్ధరాత్రి పనులు కొనసాగిస్తున్నాడు. దీని వెనుక ఆట స్థలం కబ్జాకి ఏదో కుట్ర జరుగుతుంది అని ఇక్కడి మహిళలు ఆందోళన చెందుతున్నారు.