Viral Video: కాశ్మీర్‌పై ఈ చిన్నారి కామెంట్స్ వైరల్..?! (వీడియో)
అక్కడికి వెళ్లని వారైనా దాన్ని ఒప్పుకుంటారు. Confident little girl speak about Kashmir and It's Beauty
దిశ, వెబ్‌డెస్క్ః కాశ్మీర్ ఒక భూతల స్వర్గమని అంటారంతా! అక్కడికి వెళ్లని వారైనా దాన్ని ఒప్పుకుంటారు. అలాంటిది, కాశ్మీర్‌కు వెళ్లిన తర్వాత అది భూమ్మీద స్వర్గం అని ఖచ్చితంగా అంగీకరిస్తారు. చిన్న పిల్లలైనా కాశ్మీర్ అందాలను చూసి మైమరిచిపోకుండా ఉండలేరు. ఇక, ఓ చిన్నారి కాశ్మీర్ పై తన అభిప్రాయాన్ని తెలుపే వీడియో(Video) ఒకటి ఇంటర్నెట్లో వైరల్(Viral) అవుతోంది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇంతియాజ్ హుస్సేన్ అనే పోలీసు అధికారి షేర్ చేసిన ఈ వీడియో కాశ్మీర్‌పై రివ్యూతో పాటు ఆ చిన్నారిలో ఉన్న కాన్ఫిడెన్స్‌ను తెలియజేస్తుంది. కాశ్మీర్లో మంచును తాకడానికే తాను వచ్చానని చెప్పిన ఈ చిన్నారి, అయితే అది జరగలేదని చాలా క్యూట్‌గా చెబుతుంది. నా పేరు కౌశిక అని పరిచయం చేసుకొని, తన లక్ష్యం మంచును తాకడమేననీ, అయితే, కాశ్మీర్ భాషా, ఇక్కడి వాతావరణం, ముఖ్యంగా హోటల్స్, బోట్ షికారు ఎంతో సంతోషం ఇస్తున్నాయని తెలిపింది. ఆమె అమాయకత్వం, ఆత్మవిశ్వాసం ప్రతిబింబించే ఈ క్లిప్ ఇంటర్నెట్లో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఒకరు ఈ వీడియోను పదులు సార్లు చూసినట్లు చెబితే, క్యూట్‌గా మాట్లాడుతున్న పాపను చూసి ముచ్చటేస్తుందంటూ చాలా మంది కామెంట్ చేశారు.