CM Jagan కోనసీమ పర్యటనలో ఆసక్తికర ఘటన.. 8 నెలల బాబుకు సీఎం గిఫ్ట్

CM Jagan Gives a pen as a gift to 8 months kid in Konaseema Tour| ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోనసీమ జిల్లా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పుచ్చకాయలవారి పేటలో ఎనిమిదేళ్ల చిన్నారిని సీఎం జగన్ ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జేబులోంచి

Update: 2022-07-26 10:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: CM Jagan Gives a pen as a gift to 8 months kid in Konaseema Tour| ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోనసీమ జిల్లా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పుచ్చకాయలవారి పేటలో ఎనిమిదేళ్ల చిన్నారిని సీఎం జగన్ ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జేబులోంచి ఆ చిన్నారి పెన్ను తీసుకున్నది. పెన్ను ఖరీదు దాదాపు రూ.70 వేలు పైనే ఉంటుందని తెలుస్తోంది. అనంతరం వరద బీభత్సంతో ముంపుకు గురైన గ్రామాల్లో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులందరికీ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ''ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి. వరదల సమయంలో నేను వచ్చి ఉంటే అధికారులు నా చుట్టూ తిరిగేవాళ్లు. అందుకే అధికారులకు వారం టైం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చా. మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది'' అని ఆయన బాధితులతో పేర్కొన్నారు. అంతేకాదు జి.పేదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీఎం జగన్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సీజన్‌ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: AP EAPCET/AP EAMCET ఫలితాలు విడుదల

Tags:    

Similar News