దిశ ప్రతినిధి, మేడ్చల్: తెలంగాణ వ్యాప్తంగా రబీ సీజన్ లో వరి కొనుగోలు కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చ అధ్యక్షుడు ఏనుగు రాజిరెడ్డి డిమాండ్ చేశారు. వరి సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వని కారణంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి కి కొనుగోలు కేంద్రాల సమస్యపై బీజేపీ కిసాన్ మోర్చ నాయకులు ఓ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించక పోవడం అమానుషం అని అన్నారు. .రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల తో కుమ్మక్కై రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర అందకుండా అన్యాయం చేయడాన్ని బీజేపీ కిసాన్ మెర్చ మేడ్చల్ రూరల్ జిల్లా తీవ్రంగా నిరసిస్తుందన్నారు. .గత ఖరీఫ్ లో కూడా కేంద్రం సహకరించిన వడ్లు కొనకుండా రైతులను తీవ్రంగా నష్ట పరిచిందని మండి పడ్డాడు . ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాల తిరుమల్ రెడ్డి,కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి గోనె మల్లారెడ్డి,ఉపాధ్యక్షులు సముద్రాల కృష్ణ గౌడ్ ,రామచంద్రారెడ్డి ,మహేందర్ గౌడ్ ,నరేందర్ రెడ్డి ,మాధవరావు ,మునీశ్వర్ రెడ్డి ,లక్ష్మారెడ్డి ,నాగరాజు ,ఆంజనేయులు ,కేశవ రెడ్డి ,దేవల నాయక్ ,గోసుల శ్రీనివాస్ ,జంగారెడ్డి,శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.