PG Vinda: సినిమాటికా విజన్ సంస్థ MD కీలక వ్యాఖ్యలు..1!
ప్రముఖ దర్శకుడు, ఫొటోగ్రాఫర్.. సినిమాటికా విజన్ సంస్థ ఎండీ పి. జీ విందా తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు, ఫొటోగ్రాఫర్.. సినిమాటికా విజన్ సంస్థ ఎండీ(Cinematica Vision Company MD) పి. జీ విందా(PG Vinda) తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ వైడ్‌గా సినీ రంగంలో వస్తున్న కొత్త పోకడలు, కొత్త టెక్నాలజీ గురించి అందరికీ తెలియాలజేయానే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం హైదరాబాదులో సినిమాటికా ఎక్స్ పో(Cinematica Expo) నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈయన ఇటీవల నిర్వహించిన రెండో ఎడిషన్ ఎక్స్‌పోకు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని వెల్లడించారు. ఏకంగా 38 వేల మంది హాజరయ్యారని, ఇది ఆసియా(Asia)లోనే పెద్ద రికార్డు అని అన్నారు.
అలాగే మూడో ఎడిషన్ కూడా ఘనంగా.. పలు ఇంటర్నేషనల్ సంస్థల సమక్షంలో జరుగుతుందని పేర్కొన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా డెవలప్ అవుతోందని అన్నారు. షూటింగ్స్‌కు అనువైన వసతులు ఉన్నాయని తెలిపారు. కానీ పలు రీజన్స్ వల్లే మనం టెక్నాలజీ(Technology) పరంగా వెనకడిపోతున్నామని.. ఆధునిక సాంకేతికత(Modern technology) మనకు లేట్‌గా పరిచయం అవుతుందని అన్నారు. కాగా ఓ ఫొటోగ్రాఫర్(Photographer)గా, డైరెక్టర్‌గా ఎప్పుడూ కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటానని వివరించారు. చివరగా 2004 లో రిలీజ్ అయిన గ్రహణం(Grahaṇaṁ) మూవీతో ఫొటోగ్రాఫర్‌గా సినీ ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలైందని సినిమాటికా విజన్ సంస్థ ఎండీ పి. జీ విందా వెల్లడించారు.