Electric cycle : మార్కెట్‌లోకి పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ సైకిల్.. వీకెండ్లో జాలీగా తిరగొచ్చు..!
సైకిల్ ఒక సాధారణ రవాణా సాధనం. ఇది మానవ శక్తితో నడవబడుతుంది. 1
దిశ, వెబ్‌డెస్క్: సైకిల్(cycle) ఒక సాధారణ రవాణా సాధనం. ఇది మానవ శక్తితో నడవబడుతుంది. 19 వ శతాబ్దంలో సైకిల్‌ను మొదటిసారిగా ఉపయోగించారు. సింగిల్ వాహనమైన సైకిల్‌ను పెడల్ సైకిల్(Pedal cycle), బైక్, పుష్-బైక్(Push-bike) లేదా సైకిల్ అని పిలుస్తుంటారు. అయితే తాజాగా ఎలక్ట్రిక్ బైకుల(Electric bikes) తయారీ కంపెనీ ఈ-ఎక్స్(E-X) ఇండియాలో ఎట్‌సీ-ఎక్స్(Etc-X) పేరేతో కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ను ఆవిష్కరించింది. తొక్కడానికి కంఫార్ట్‌గా ఉంటుందని, అలాగే స్టైల్‌గా ఉంటుందని దృష్టిలో పెట్టుకుని ఈసైకిల్ ను కంపెనీ వెల్లడించింది.
అయితే ఈ సైకిల్ కు ట్యూబ్ ఉండదు కాబట్టి.. ఎస్‌టీ-ఎక్స్(ST-X)ను హైట్ తక్కువ ఉన్నవారు కూడా నడపొచ్చు. ముఖ్యంగా మహిళలకైతే చాలా కంఫార్ట్‌గా ఉంటుంది. రైడింగ్ సౌలభ్యాన్ని పెంచే ఇతర హార్డ్వేర్ల(hardware)లో ఎర్గోనామిక్ హ్యాండిల్ బార్లు(Ergonomic handle bars), స్లిమ్ డిజైన్(Slim design), అడ్జెస్టెబుల్ శాడిల్(Adjustable saddle), ఉన్నాయి. ఈ వస్తువులతో,వారాంతపు ప్రయాణాలు, ఎలక్ట్రిక్ బైసైకిల్(Electric bicycle) రోజువారీ ప్రయాణాలు, ఫిట్నెస్ దినచర్యలకు కూడా బాగా సరిపోతుంది.
ఈ సైకిల్‌కు 36వీ, 36వీ- 7.65 ఎహెచ్ లిథియం(7.65 Ah Lithiumbicycle).. అయాన్ బ్యాటరీ(Ion battery), 250 వాట్ల రేర్ హబ్ మౌంటెడ్ మోటార్(250 watt rare hub mounted motor) ఉన్నాయి. స్వాపింగ్(Swapping) లేదా ఛార్జింగ్(charging) కోసం ఫ్రేమ్ నుంచి వేరు కూడా చేసుకునే చాన్స్ ఉంది. ఎస్‌టీ-ఎక్స్ ఛార్జింగ్ సమయం సుమారు 4-5 గంటలు. ఇది పెడల్ అసిస్టెన్స్(Pedal assistance)తో 35 కిలోమీటర్లు(35 kilometer), ఎలక్ట్రిక్ ఓన్లీ మోడ్(Electric only mode)లో 30 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ బీజ్(Electric bike beige), టీల్ బ్లూ కలర్(Teal blue color) వంటి రెండు రంగులలో లభిస్తుంది. అధికారిక ఈ-కామర్స్ వెబ్సైట్(E-commerce website), ఆఫ్‌లైన్ ఛానల్స్(Offline channels), అమెజాన్- ఫ్లిప్‌కార్ట్(Amazon-Flipkart) వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్(E-commerce platform)లలో ఎస్‌టీ-ఎక్స్ ప్రీగా ఆర్డర్ చేసుకోవచ్చు. దీని ధర రూ. 29, 999 గా ఉంది.