Aghoris : మీసాలు, గడ్డంతో కర్నూలు జిల్లాలో అఘోరీ హల్చల్
Aghoris are making a splash in Kurnool district with moustaches and beards
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ తన చర్యలతో హల్చల్ చేస్తున్న అఘోరీ(Aghoris) నాగ సాధువు కర్నూలు జిల్లా(Kurnool district)లో పెట్టుడు గడ్డం, మీసంతో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. అఘోరీని చూసి స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. నిమ్మకాయలతో ఏం చేస్తున్నావంటూ కొందరు మహిళలు అఘోరీని ప్రశ్నించగా.. తాను దిష్టి తీస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. అసలు అఘోరీ గడ్డం, మీసాలతో కనిపించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది మరింత చర్చనీయాంశమైంది. సనాతన ధర్మం, మహిళల రక్షణ, హిందూ దేవాలయాల పరిరక్షణ లక్ష్యంగా హిమాలయాల నుంచి జన సంచారంలోకి రావడం జరిగిందంటున్న అఘోరీ వ్యవహారం మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం తర్వాత తొలిసారిగా అఘోరీ తెరపైకి వచ్చింది. ఒంటికాలిపై పూజలు చేసింది. సనాతన ధర్మ రక్షణకు, లోక కల్యాణం కోసం జనంలోకి వచ్చానంటు చెప్పుకుంది. మంచిర్యాల జిల్లా కుష్నపల్లికి చెందిన అఘోరీ తను మహిళనని చెప్పినప్పటికి తర్వాత అమె తల్లి దండ్రుల కథనం మేరకు ట్రాన్స్‌జెండర్ గా మారిన శ్రీనివాస్ అని తేలింది. చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లి అఘోరీ, నాగసాధువుగా మారింది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నగ్నంగా సంచరిస్తున్న అఘోరీ దేవాలయాలను సందర్శిస్తూ హల్చల్ చేస్తోంది. ఆత్మార్పణ యత్నాలు, శ్మశానంలో పూజలు వంటి తన చర్యలతో జనం దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం గడ్డం, మీసాలతో, గాజులు వేసుకుని కారులో కూర్చున్న అఘోరీ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.