దుందుభి నదిలో మత్స్యకారుడికి చిక్కిన అరుదైన, వింత చేపలు
నాగర్ కర్నూల్ జిల్లా కృష్ణా ఉపనది దుందుభిలో ఓ జాలరికి వింత చేపలు వలలో చిక్కాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా కృష్ణా ఉపనది దుందుభిలో ఓ జాలరికి వింత చేపలు వలలో చిక్కాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... జిల్లాలోని ఉప్పునుంతల మండలం కంసానిపల్లి సమీపంలోని దుందుభి నదిలో కంసానిపల్లి గ్రామానికి చెందిన చీమర్ల మణిందర్ రోజువారిగా చేపల వేటకు వెళ్లాడు. ఉదయం ఆయన నదిలో విసిరిన వలలో రెండు వింత చేపలు చిక్కాయని తెలిపారు. ఒకటి పాము ఆకారంలో ఉన్న ''మలగమేను'' మరొకటి వింత ఆకారంలో ఉన్న చేప వలలో చిక్కిందన్నాడు. మలగమేను జాతికి చెందిన చేప అరుదుగా లభిస్తుందని, దాని విలువ అధికంగా ఉంటుందని తెలిసింది. ప్రధానంగా దానిని ఔషధంగా వాడుతారుని చర్చ జరుగుతుంది. అలాగే ఎన్నడూ చూడని వింత చేప లభించడంతో పలువురు ఆ చేపలను ఆసక్తిగా తిలకించారు.