Nampally: నిలోఫర్‌లో పసికందు కిడ్నాప్ కేసు సుఖాంతం.. ఆరు గంటల్లో ఛేదించిన పోలీసులు
నిలోఫర్ ఆసుపత్రి(Nilofar Hospital)లో పసికందు(Baby) కిడ్నాప్(Kidnap)అయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్/ అలంపూర్: నిలోఫర్ ఆసుపత్రి(Nilofar Hospital)లో పసికందు(Baby) కిడ్నాప్(Kidnap)అయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు(Nampally Police) ఆరు గంటల్లోనే చిన్నారి ఆచూకీ కనుగొన్నారు. జహీరాబాద్(Zaheerabad) కు చెందిన హసీనా బేగం(Hasina Begum), గఫార్(Gafar) దంపతులకు చెందిన నెల రోజుల బాబుకు జాండీస్ రావడంతో హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం రాత్రి హసీనా బేగం బాబును ఎత్తుకొని ఉండగా.. ఆసుపత్రి సిబ్బందిని అని తల్లిని నమ్మించిన ఓ మహిళ బాబుని ఎత్తుకొని అక్కడి నుంచి జారుకుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాబుని హైదరాబాద్ నుండి కర్నూల్ వైపు తరలించారని గుర్తించి, జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉండవెల్లి, అలంపూర్, మానవపాడు చెందిన ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు టోల్గేట్ సమీపంలో వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఓమ్ని వ్యాన్‌లో ముగ్గురు చిన్నారులతో ఆరుగురు కలిసి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అందులో ఓ మగ పిల్లవాడు, ఇద్దరు ఆడబిడ్డలు సురక్షితంగా ఉన్నారని పోలీస్ శాఖ అధికారులకు సమాచారం అందించి, ఆరుగురు కిడ్నాపర్లను అదుపులకు తీసుకొని నాంపల్లి స్టేషన్ కు అప్పగించారు. అనంతరం నాంపల్లి పోలీసులు పసికందును సురక్షతంగా తల్లి హసీనా బేగం వద్దకు చేర్చారు. జోగులాంబ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని 6 గంటల వ్యవధిలోనే ముఠాను పట్టుకోవడంతో కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.