ఈనెల 30న మహబూబ్ నగర్‌లో రైతు బహిరంగ సభ
ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో రైతు బహిరంగ సభ(Farmers open meeting )ను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) నిర్ణయించింది.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో రైతు బహిరంగ సభ(Farmers open meeting )ను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) నిర్ణయించింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన రుణమాఫీ, తదితర అంశాలతో పాటు మునుముందు చేపట్టబోయే కార్యక్రమాలను గురించి రైతుల లోకి తీసుకువెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక సభను నిర్వహించేందుకు భూత్పూర్ మున్సిపల్ కేంద్రం అమిస్తాపూర్ గ్రామ శివారులో ఉన్న ఖాళీ స్థలాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, అడిషనల్ ఎస్పీ రాములు, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ నవీన్ తదితరులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సభను విజయవంతం చేసేందుకు గాను ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమై సభను జయప్రదం చేసే అంశంపై చర్చించనున్నారు. కాగా ఈ నెల 28న కొల్లాపూర్‌లో జరగవలసిన ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలిపారు.