30న జిల్లాకు ముఖ్యమంత్రి రాక..?
ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రంకు రానున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటనపై 'దిశ' వాకబు చేయగా..ఇటు అధికారులు,అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రంకు రానున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటనపై 'దిశ' వాకబు చేయగా..ఇటు అధికారులు,అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. శనివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,పోలీస్ అధికారులు మాత్రం సీఎం పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లకు పట్టణ శివారులోని ఎంవీఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని,అనంతరం భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలోని స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్,మోహన్ రావు,ఎఎస్పీ రాములు,డిఎస్పీ వేంకటేశ్వర్లు,మహబూబ్ నగర్ తహసీల్దార్ ఘన్సీరాం,భూత్పూర్ తహసీల్దార్ రహెమాన్,తదితరులు పాల్గొన్నారు.