Chayote Benefits: గ్రామాల్లో దొరికే సీమ వంకాయ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు?

మీ రోజువారీ ఆహారంలో కూరగాయలు (Vegetables )చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Update: 2024-10-22 12:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: మీ రోజువారీ ఆహారంలో కూరగాయలు (Vegetables )చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కూరగాయలు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి. ఇవి సరైన పోషకాహారాన్ని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపుతాయి. కూరగాయల్లో చాలా రకాలున్నప్పటికీ ఎవరికి ఇష్టమైనవి వారు తింటుంటారు. కూరగాయల్లో రాజు ఎవరంటే వంకాయ అని అందరికీ తెలిసిందే. వంకాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో సీమ వంకాయ (Chayote ) ఒకటి. ఇవి చాలా మందికి ఎక్కువగా తెలియదు. కానీ ఇవి గ్రామాల్లో ఎక్కువగా లభిస్తాయి. సీమ వంకాయ చూడానికి డిఫరెంట్ గా ఉంటుంది కానీ రుచి మాత్రం వేరే లెవెల్. మరీ ఆరోగ్యప్రయోజనాలంటారా? ఎన్నో లాభాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సీమ వంకాయ హెల్త్ బెనిఫిట్స్..

సీమ వంకాయ తింటే మధుమేహంతో బాధపడుతున్నవారికి మేలు జరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants ), ఫ్లేవనాయిడ్స్ రక్తం స్థాయిలను నియంత్రించి కంట్రోల్ చేస్తాయి. అలాగే హెయిర్, స్కిన్ ప్రాబ్లమ్స్(Hair and skin problems ) కు చెక్ పెడుతాయి. సీమ వంకాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు బాడీలోని ఫ్రీ రాడికల్స్ ను, విష పదార్థాలను బయటకు పంపించడంలో తోడ్పడుతాయి. తద్వారా స్కిన్ తళతళ మెరిసిపోతుంది. హెయిర్ ను స్ట్రాంగ్ గా ఉంచడంలో మేలు చేస్తుంది.

గుండె ఆరోగ్యం పదిలం..

ఈ వంకాయలోని పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వెయిట్ లాస్ అవ్వడానికి, ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ(Pregnancy ) మహిళలకు సీమ వంకాయ మంచిది. దీనిలో ఫోలెట్(Follett) అధికంగా ఉంటుంది. కాగా ఆహారంలో సీమ వంకాయ చేర్చుకుంటే తల్లికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా సీమ వంకాయ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో చాలా మేలు చేస్తుంది. దీనిలో పీచు పదార్థాలు, పొటాషియం గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కూడా అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News