భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో.. స్టాక్‌ మార్కెట్లు(Stock markets) వరుసగా రెండో రోజు భారీ లాభాలో ముగిసాయి.

Update: 2024-11-25 10:56 GMT

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో.. స్టాక్‌ మార్కెట్లు(Stock markets) వరుసగా రెండో రోజు భారీ లాభాలో ముగిసాయి. మహారాష్ట్రలో బీజేపీ(BJP) నేతృత్వంలోని కూటమి విజయవంతమైన కారణంగా సూచీలు వరుసగా రెండో రోజు కూడా మంచి లాభాలు రాబట్టాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ వంటి దిగ్గజ షేర్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి. ఫలితంగా సెన్సెక్స్‌(Sensex) 80,000 పాయింట్లను మరోసారి దాటగా, నిఫ్టీ(Nifty) 24,200 పాయింట్లకు పైగా నిలిచింది. ఈ రోజు ఉదయం 80,193.47 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై సెన్సెక్స్‌ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఇందులో ఇన్రాడేలో 1,300 పాయింట్లకు పైగా పెరిగి 80,473.08 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 992.74 పాయింట్ల లాభంతో 80,109.85 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 314.65 పాయింట్ల లాభంతో 24,221.90 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే కొంత బలపడి 84.30కి చేరింది.


Similar News