Hydrogen Fuel: మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన అమర రాజా ఇన్‌ఫ్రా

ప్రభుత్వ రంగ ఇంధ సంస్థ ఎన్‌టీపీసీ కోసం లద్దాఖ్‌లోని లేహ్‌లో దీన్ని నిర్మించారు

Update: 2024-11-25 12:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ అమర రాజా ఇన్‌ఫ్రా దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ రంగ ఇంధ సంస్థ ఎన్‌టీపీసీ కోసం లద్దాఖ్‌లోని లేహ్‌లో దీన్ని నిర్మించారు. ఈ మేరకు అమర రాజా ఇన్‌ఫ్రా సోమవారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ స్టేషన్‌ను ప్రారంభించారని కంపెనీ తెలిపింది. సముద్ర మట్టానికి 3,400 మీటర్ల ఎత్తులో, మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల్ సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశంలో, రోజుకు 80 కిలోల గ్రీన్ హైడ్రోజన్2 ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఇంధన స్టేషన్ ప్రాజెక్ట్‌ను రెండేళ్లలో పూర్తి చేశామని కంపెనీ వివరించింది. ఈ స్టేషన్ ద్వారా లేహ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్గార రహిత రవాణాను పెంచేందుకు, గ్రీన్ మొబిలిటీ స్పేస్‌లో భారత్ స్థాయిని మరింత ఉన్నతం చేస్తుంది. స్టేషన్ కార్యకలాపాలు మొదలవడంతో ఎన్‌టీపీసీ ఇప్పుడు ఐదు హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ బస్సులను నడుప్తుందని కంపెనీ పేర్కొంది. 

Tags:    

Similar News