భారత్‌లో ఎఫ్‌బీఐ టీం.. క్లారిటీ ఇచ్చిన సీబీఐ

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఓ కేసు విచారణలో భాగంగా యూఎస్‌కు చెందిన ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) రాలేదని సీబీఐ

Update: 2022-04-10 11:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఓ కేసు విచారణలో భాగంగా యూఎస్‌కు చెందిన ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) రాలేదని సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) తెలిపింది. ఈ విషయంపై యూఎస్‌ అధికారులు ఏ టీంను భారత్‌కు పంపలేదంటో సీబీఐ క్లారిటీ ఇచ్చింది. అయితే కర్ణాటక బిట్ కాయిన్ మోసాల కేసులో భాగంగా భారత్‌కు ఎఫ్‌బీఐకు చెందిన ఓ టీం వచ్చిందని, ఎవరికీ అనుమానం రాకుండా తన విచారణను సాగిస్తోందంటూ కర్ణాటక కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారని, అంతేకాకుండా ఈ తతంగాన్నంతా బీజేపీ వారు కప్పిపుచ్చారని కూడా వారు ఆరోపించారు. తాజాగా వీటిపై సీబీఐ క్లారిటీ ఇచ్చింది. అటువంటి టీం ఏదీ రాలేదని చెప్పింది. కర్ణాటక బిట్ కాయిన్ కేసును ఆ రాష్ట్ర పోలీసులే విచారిస్తున్నారని తెలిపారు.

Tags:    

Similar News