యూపీ ఎన్నికలు.. తెలంగాణలో అనుకున్నంత పని చేసిన బీజేపీ
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేతలు అనుకున్నంత పని చేశారు. తెలంగాణలో బుల్డోజర్ల ను latest telugu news..
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేతలు అనుకున్నంత పని చేశారు. తెలంగాణలో బుల్డోజర్ల ను దింపుతామని చెప్పడమే ఆలస్యం వెంటనే బుల్డోజర్లు దింపేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణలో బుల్డోజర్లను దింపుతామని చేసిన కామెంట్ల నేపథ్యంలో జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఏకంగా బుల్డోజర్ తో వచ్చాడు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ గుర్తు అయిన సైకిల్ ను బుల్డోజర్ తో తీసుకెళ్లి కింద పడేశారు. బీజేపీ సంబురాల్లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.