ఆమె జుట్టే.. పిట్ట గూడు.. వైరల్ అవుతున్న వీడియో

దిశ, ఫీచర్స్: మనుషులు-పక్షుల మధ్య విడదీయలేని బంధం ఉంది. ..telugu latest news

Update: 2022-03-28 10:25 GMT

దిశ, ఫీచర్స్: మనుషులు-పక్షుల మధ్య విడదీయలేని బంధం ఉంది. సాధారణంగా పిచ్చుకలు చెట్ల పైన, ఇంటి పైకప్పు అంచులకు గూళ్ళు కడతాయని తెలుసు. లేదంటే కొందరు వాటిని ఓ గూడులో బంధించి ఇంట్లోనే పెంచుతుంటారు. కానీ ఇక్కడొక అమ్మాయి తన జుట్టునే పిట్టగూడుగా మలిచింది. భారీ తుఫాన్‌కు గూడు చెదిరిన పక్షికి తన కేశాల్లోనే ఆతిథ్యమిచ్చింది. తల్లికి దూరమైన ఆ బుజ్జి పిట్టకు ఓ అమ్మలా తినడం కూడా నేర్పించింది. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2013లో వీసా సమస్యలతో పని లేకుండా ఖాళీగా ఉన్న 'హన్నా బోర్న్ టేలర్'.. ఆ సమయంలో ప్రకృతితో మమేకమైంది. ఈ క్రమంలోనే పక్షుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. బర్డ్స్‌కు సంబంధించిన ఒక్కో స్పెషల్ క్వాలిటీ.. వాటిపై ఆమె ప్రేమ పెంచుకునేలా చేశాయి. ఇదిలా ఉంటే 2018లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ తుఫాన్.. తనకు ఓ ప్రత్యేక బంధాన్ని పరిచయం చేసింది. గాలి దుమారం కారణంగా చెట్టుమీది గూడు చెదిరిపోయి తుదిశ్వాస తో పోరాడుతున్న ఓ పక్షి తన కంటపడటంతో చేరదీసింది. దానికి వెచ్చదనాన్ని కల్పించేందుకు ఓ కార్డుబోర్డులో తేయాకులు వేసి, గూడు మాదిరిగా ఏర్పాటుచేసి రక్షణ కల్పించింది. ఈ క్రమంలోనే పక్షికి హన్నా తల్లిగా మారగా.. రోజులు గడిచే కొద్దీ ఆ పిట్ట(ఫించ్) తన వెంట్రుకలనే గూడుగా మార్చేసుకుందని చెప్పింది.

ఇలా ఏకంగా 84 రోజుల పాటు తన జుట్టులోనే జీవించడంతో వీరిద్దరి బంధం దృఢంగా మారిపోయింది. అయితే క్రిస్మస్ టైమ్‌లో ఆ పక్షికి సంబంధించిన గుంపు తిరిగిరావడంతో తనను విడిచిపెట్టానని.. తను సరిగ్గా బతకగలదని, ఎగిరే శక్తి ఉందని తెలిశాకే ఇందుకు నిర్ణయించుకున్నానని చెప్పింది.

Tags:    

Similar News