ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్
దిశ ప్రతినిధి, మేడ్చల్ : అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో మరో తిమింగలం చిక్కింది. తన తల్లిపైన
దిశ ప్రతినిధి, మేడ్చల్ : అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో మరో తిమింగలం చిక్కింది. తన తల్లిపైన ఉన్న ఆస్తి మ్యుటేషన్ చేయాలని కోరిన బాధితుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఓ బిల్ కలెక్టర్ అడ్డంగా బుక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని చౌదరి గూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రవీందర్ అనే బిల్ కలెక్టర్ గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. సిగని ఆంటోనీ అనే నివాసితులు తన తల్లి పైన ఆస్తిని మ్యుటేషన్ చేయవలసిందిగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో రవీందర్ ను సంప్రదించాడు.
అయితే బిల్ కలెక్టర్ రవీందర్ తనకు రూ.10 వేలు లంచం ఇస్తే గాని పనులు చేయనని చెప్పాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. వారు వలపన్ని రవీందర్‌ను రెడ్ హ్యాండెడ్ గా రూ. పది వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు గ్రామ పంచాయతీలోనే సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని, రికార్డులను తనిఖీ చేశారు.