Sankranti: సంక్రాంతి రోజున సూర్యుడు రాశి సంచారం.. ఆ రాశుల వారికీ గుడ్ డేస్ స్టార్ట్..
జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, ఈ రాజయోగం 12 రాశుల వారిపైన ప్రభావాన్ని చూపనున్నాయి. 2025 జనవరి 14వ తేదీన సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే, మకర సంక్రాంతి రోజున సూర్యుడు రెండు రాశుల వారికీ శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
వృశ్చిక రాశి
సూర్య సంచారం కారణంగా మకర సంక్రాంతి నుంచి ఈ రాశి వారికీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. మీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టిన వారికీ లాభాలు వస్తాయి. వ్యాపారాలు చేసే వారికీ ధన లాభాలు ఉంటాయి.
సింహరాశి
సూర్య సంచారం కారణంగా సంక్రాంతి నుండి సింహరాశి వారి జాతకం మారుతుంది. సూర్యుడు ఐదవ స్థానంలో ఉండడం వలన ఏ పని చేపట్టిన తిరుగులేకుండా ముందుకు సాగుతుంది. సింహరాశికి సూర్యుడు అధిపతి కావడంతో వీరికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.