Shani Dev: శని దేవుడు అనుగ్రహం పొందాలంటే.. శనివారం ఈ పరిహారం చేస్తే చాలు..!

శనివారం ఈ పరిహారం చేస్తే చాలు..

Update: 2024-12-25 03:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : శనివారాన్ని శని దేవుడికి అంకితమని చెబుతారు. అయితే, ఎవరి మీద శని అనుగ్రహం ఉంటుందో వారు అన్నీ పనుల్లో విజయం సాధిస్తారు. శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలనిస్తాడు. శని వారం రోజున ప్రత్యేక పరిహారాలు చేస్తే శని దేవుడు కరుణిస్తాడు.

శని దేవుడు కన్నెర్ర చేస్తే.. జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. శని దేవుడి అనుగ్రహం కోసం శనివారం ఉత్తమమైన రోజని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శనిదేవుని చెడు దృష్టి ఒక్కసారి పడిందా .. రోజూ ఆటంకాలు ఎదురవుతుంటాయి. మీరు శనివారం రోజున దేవుడి గుడిలో ప్రత్యేక పూజలు చేయాలి. ఇది శని దేవుడు శాంతిస్తాడు. ఒకరి సమస్యలకు ముగింపునిస్తుంది.

మీరు జీవితంలో డబ్బు సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, శనివారం రోజున శని దేవాలయానికి వెళ్లి ఆవాలనూనె దీపం వెలిగించి మూడు లవంగాలు వేయాలి. అలాగే, సాయంత్రం రోజు మరలా పిప్పల చెట్టు కింద దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన జీవితంలో వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News