Astrology: మిథునరాశిలో కుజుడు సంచారం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు

జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి

Update: 2024-12-24 09:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, ఈ  రాజయోగం 12 రాశుల వారిపైన ప్రభావాన్ని చూపనున్నాయి. వక్రదశలో ఉన్న కుజుడు జనవరిలో నుండి మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ వరకు ఇదే రాశిలోనే ఉండనున్నాడు. ఈ కారణంగా రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సింహ రాశి

సింహ రాశి వారు కుజుడు కారణంగా ఆదాయం పొందుతారు. రావాల్సిన  డబ్బు చేతికి అందుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. ముఖ్యంగా, రాజకీయవేత్తలకు కలిసి వస్తుంది. అలాగే, విదేశాలలో ఉన్న నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వస్తాయి. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

కన్యారాశి

కన్యారాశి కుజ సంచారం కారణంగా కలిసి వస్తుంది. కొత్తగా ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. పెట్టుబడులు పెట్టిన వారికీ మంచి లాభాలు వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పాత కాలంలో కొనుగోలు చేసిన భూములకు రేట్లు పెరుగుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News