The India House: రామ్ చరణ్, నిఖిల్ భారీ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రివీల్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

టాలీవుడ్‌ హీరో నిఖిల్ (Nikhil siddhartha)‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడనే విషయం తెలిసిందే.

Update: 2024-12-25 04:19 GMT

దిశ, సినిమా: టాలీవుడ్‌ హీరో నిఖిల్ (Nikhil siddhartha)‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ టాలెంటెడ్‌ యాక్టర్ నటిస్తున్న చిత్రాల్లో ‘ది ఇండియా హౌస్‌' (The India House) ఒకటి. స్టార్ హీరో రాంచరణ్‌ (Ram charan) సమర్పిస్తున్న ఈ సినిమాకు రామ్‌వంశీ కృష్ణ(Ram Vamshi Krishna) దర్శకత్వం వహిస్తుండగా.. వీ మెగా పిక్చర్స్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై విక్రమ్‌ రెడ్డి(Vikram Reddy), అభిషేక్‌ అగర్వాల్‌(Abhishek Agarwal) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మయాంక్‌(Mayank) సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే సయీ మంజ్రేకర్‌(saiee manjrekar) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్‌(AnupamKher) కీలక పాత్రలో నటిస్తున్నాడు.

1905 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో లవ్‌, రెవల్యూషనరీ ఎలిమెంట్స్‌తో సాగే కథాంశంతో ఈ చిత్రం రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్‌ ఫస్ట్‌ లుక్ రూపంలో ఆసక్తికర అప్‌డేట్ అందించారు. మంగళవారం సయీ పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఆమెకు స్పెషల్ విషెస్ తెలిపారు. ఇక ఈ పోస్టర్‌ను గమనించినట్లయితే.. సయూ బ్లూ కలర్ చీర కట్టుకొని, నగలు పెట్టుకొని సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చింది. అయితే ఈమె సతీ అనే పాత్రలో నటిస్తున్నట్లుగా పోస్టర్‌ను చూస్తే అర్థమైతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట ఆకట్టుకుంటుంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News