Boycott Sai Pallavi: సాయి పల్లవికి బిగ్ షాక్.. బాయ్‌కాట్ అంటూ నెట్టింట ట్రోల్స్

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. నేచురల్ బ్యూటీగా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

Update: 2024-10-28 12:15 GMT

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. నేచురల్ బ్యూటీగా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ ప్రేక్షకులను తన అందం, అభినయంతో మంత్ర ముగ్దులను చేసింది. ప్రజెంట్ ‘అమరన్’(Amaran) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో శివ కార్తీకేయన్‌కు జోడీగా నటిస్తోంది. అయితే ‘అమరన్’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషల్లో అక్టోబర్ 31న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇలాంటి టైమ్‌లో సాయిపల్లవికి బిగ్ షాక్ తగిలింది. ఆమెను బాయ్‌కాట్ (Boycott Sai Pallavi)చేయాలని నెటిజన్లు ట్విట్టర్‌లో పలు పోస్టులు పెడుతున్నారు.. దానికి కారణం ‘విరాట పర్వం’(Virata Parvam) సినిమా టైమ్‌లో ఆమె చేసిన కామెంట్స్. ఇప్పుడు మరోసారి ఈ వీడియోను షేర్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తూ మండిపడుతున్నారు. అందులో ఏముందంటే.. ‘‘పాకిస్థాన్‌లో ఉండే మనుషులు భారత సైనికులను టెర్రరిస్ట్ గ్రూప్‌లాగా భావిస్తారు. కానీ మనకు పాకిస్థాన్ సైన్యం టెర్రరిస్టుల్లాగా కనిపిస్తుంది.

అలా అభిప్రాయాలు మారుతుంటాయి. నాకు అస్సలు ఈ హింస అంతా ఎందుకో అర్థం కాదు’’ అని చెప్పుకొచ్చింది. అయితే సాయి పల్లవి(Sai Pallavi) అప్పుడు ఇండియన్ ఆర్మీ గురించి ఇలా మాట్లాడి ఇప్పుడెలా అమరన్‌లో నటిస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన తను ఇప్పుడు ఎందుకు ఈ సినిమాలో నటించడం డబ్బుల కోసమా అని మండిపడుతూ.. ‘‘సాయిపల్లవి(Sai Pallavi) బాయ్‌కాట్’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ ప్రభావం ‘అమరన్’ మూవీపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు.

 

Tags:    

Similar News