Best tips: డైలీ చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరిగేందుకు బెస్ట్ టిప్స్.. ఈ ఛేంజెస్ చేస్తే చాలు

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరిగ్గా తిండి కూడా తినట్లేదు జనాలు.

Update: 2024-12-15 14:17 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరిగ్గా తిండి కూడా తినట్లేదు జనాలు. ఉదయం లేవగానే ఆఫీస్(Office) అంటూ మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు బిజీబిజీగా గడిపేస్తున్నారు. బయట దొరికే ఫుడ్(Food) తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే డైలీ మీరే చేసే పనిలో అయినా ప్రొడక్టివిటీ పెరిగేందుకు ఈ టిప్స్ పాటించితే చాలంటున్నారు నిపుణులు. రోజు మీరు చేస్తోన్న పనేంటి? చేయాల్సినవి.. ఎంత సేపు చేస్తున్నారు? వంటి ప్రశ్నలకు మీరు ఆన్సర్ రావాలి. దీంతో రోజూ మీరు చేసే విధానంలో ఛేంజెస్ తీసుకువస్తే ప్రొడక్టివిటీ(Productivity) పెరుగుతుంది.

డైలీ చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరగాలంటే.. మల్టీ టాస్కింగ్(Multitasking) వద్దు. అంటే ఒకేసారి రెండు మూడు పనులు పెట్టుకోవద్దు. దీంతో మీరు పనిపై ఫోకస్ చేయలేదు. ప్రొడక్టివిటీ పెరగాలంటే ఒక వర్క్ సరిపోతుంది. అలాగే సాయంత్రం పని కంప్లీట్ అయ్యాక వాకింగ్(walking) లేదా ఫ్రెండ్స్‌తో బయటకెళ్లి టీ తాగడం వంటివి చేయండి. దీంతో ఉపశమనాన్ని పొందవచ్చు. మనసుకు ఫీలింగ్ బెటర్ అనిపిస్తుంది. మీ ఫోన్‌లో మీరు వాడని డిజిటల్ యాప్స్(Digital Apps) డిలీట్ చేసేయండి. మీ మొబైల్ క్లీన్‌గా ఉంటే మీ మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. వర్క్ చేస్తున్నప్పుడు విరామం తీసుకోండి. ఒకే దగ్గర కూర్చుని వర్క్ చేయడం వల్ల పలు సమస్యలొస్తాయి. మెదడు అలసిపోతుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.


Similar News