Heart attack: శీతాకాలంలో చల్లటి వాటర్‌తో స్నానం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకపోతే..?

ఇటీవల చాలా మంది గుండెపోటు(heart attack) సమస్యతో బాధపడుతున్నారు.

Update: 2025-01-10 10:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల చాలా మంది గుండెపోటు(heart attack) సమస్యతో బాధపడుతున్నారు. గుండెలో ఆకస్మికంగా నొప్పి రావడం, తీవ్రమైన నొప్పి మెడ వరకూ పాకుతూ చాలా మందిలో హార్ట్ ఎటాక్ వస్తుంది. వీటితో పాటు గుండెపోటు వచ్చే ముందు ఆకస్మిక మైకము, వికారం.. బాడీ అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఛాతీలో నొప్పి(chestPain) ప్రారంభమై ఎడమ చేతి, ఎడమ దవడ.. కుడి చేతి వరకు కూడా ఈ నొప్పి వ్యాపిస్తుంది. ఈ రకంగా మనిషి వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నాడు. అయితే కూల్ వాటర్ తాగడం వల్ల గుండెపోటు లేదా రక్తపోటు(blood pressure) వస్తుందా? ఈ రెండింటికి సంబంధం ఏంటి? సంకేతాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం..

పైగా ఇది చలికాలం.. కాగా ఒక్కసారిగా చల్లని వాటర్ తలమీద పోస్తే గుండెపోటుకు గురయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారిగా వాటర్ పోయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. కాగా వాటర్ ముందుగా కాళ్ల మీద, వీపు, మెడ, తర్వాత తలపై పోసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News