ఆలయ జాతర్లలో ఆ విక్రయదారుల నిషేధం.. కర్ణాటక లో వెలసిన పోస్టర్లు
బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి ప్రాంతంలో ఏటా ఎంతో వైభవంగా జరిగే హోసా మార్గుడి ఆలయ latest telugu news..
బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి ప్రాంతంలో ఏటా ఎంతో వైభవంగా జరిగే హోసా మార్గుడి ఆలయ జాతరలో భాగంగా ముస్లిం విక్రయదారులపై నిషేధం కొనసాగుతోంది. ప్రతి ఏటా ఈ జాతర సమయంలో సుమారు 100 మందికి పైగా ముస్లిం విక్రయదారులు హిందువులతో కలిసి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారు. అయితే, ఈసారి వారికి అనుమతి లేదని టెంపుల్ కమిటీ తేల్చిచెప్పింది. అంతే కాకుండా హిందూ ఆలయాల జాతర్లలో ముస్లిం వెండర్ల పై బ్యాన్ విధించినట్టు పోస్టర్లు వెలిశాయి. ఇదే విషయమై ఉడుపి వీధి విక్రయదారుల సంఘం జనరల్ సెక్రటరీ ఆఫ్ మహమ్మద్ ఆరిఫ్ ఆలయ కమిటీ మెంబర్లను కలిసి మాట్లాడగా.. వారిపై రైట్‌వింగ్‌కు సంబంధించిన వారి నుంచి ఒత్తిడి అధికంగా ఉందని ఆయన చెప్పారు. దీనంతటికీ హిజాబ్ వివాదం కారణమని, కోర్టు తీర్పును తప్పుబడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వడంతో హిందూ స్టాల్స్ కూడా మూతబడ్డాయి.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ముస్లిం వెండర్లపై బ్యాన్ విధించినట్టు ఆరిఫ్ వెల్లడించారు. ఈ విషయం పై కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత యూటీ ఖాదర్ ప్రశ్నించారు. దీనిపై న్యాయ శాఖ మంత్రి జేసీ మధు స్వామి వెంటనే స్పందించారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను అంగీకరించబోదని స్పష్టం చేశారు. టెంపుల్ పరిసరాల్లోనే కాకుండా రాష్ట్రంలో అక్కడక్కడా వెలసిన పోస్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి రిపోర్టులు అందజేయాలని కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర పోలీసులను ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.