చలికాలంలో అందరూ పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు..?

చలికాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు చెబుతూనే ఉంటారు.

Update: 2025-01-05 13:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: చలికాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే మనం ఎంత కేర్ తీసుకున్నా.. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వేధిస్తూనే ఉంటాయి. కాగా ఆయుర్వేద చిట్కాలతో చెక్ పెట్టొచ్చని తాజాగా నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు ఆరోగ్యం..

ఆలివ్ ఆయిల్, గుడ్డు పచ్చసొన కలిపి హెయిర్ కు పట్టించి ఇరవై నిమిషాలు ఉంచాలి. తర్వాత తలస్నానం చేయాలి. అలాగే బ్రహ్మి, శీకాకాయ రెండింటిని మిక్సీలో పట్టి.. జుట్టుకు మాస్క్ చేసుకోవాలి. 30నిమిషాలయ్యాక హెయిర్ వాష్ చేయాలి.

స్కిన్ ఆరోగ్యం..

కలబంద గుజ్జు, కాకరకాయ రసం కలిసి ఫేస్ కు అప్లై చేసుకోండి. అలాగే పెరుగు, తేనె కలిపి రాసుకోండి. 15 నిమిషాలయ్యాక ఫేస్ వాష్ చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.

దగ్గు, జలుబు నుంచి ఉపశమనం..

వాటర్‌లో రాత్రంతా జింటర్ రూట్ నానబెట్టి తాగితే దగ్గు, జలుబు కు చెక్ పెట్టొచ్చు. ఆహారంలో కూడా అల్లం ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతూనే ఉంటారు. అలాగే జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే.. పాలతో పసుపు వేసుకుని తాగాలి.

పాదాల పగుళ్లు..

పాదాల పగుళ్లు తగ్గాలంటే అరటిపండు గుజ్జును పగుళ్లకు పట్టించాలి. ఇది 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడగాలి. అలాగే పడుకునే ముందు సాక్స్ వేసుకోవాలి. లేకపోతే వంటనూనె పాదాలకు పట్టించాలి.

కాళ్లవాపు..

కాళ్లవాపు తగ్గాలంటే వాటర్ లో ధనియాలు పోసి.. వాటర్ సగం ఇనికేవరకు మరిగించాలి. వాపు తగ్గే వరకు ఇలాగే రోజూ తాగాలి. అలాగే నువ్వుల నూనె కూడా బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు నూనెతో మర్దన చేస్తే వాపులు తగ్గుతాయి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News