KTR Emergency Meeting : కేటీఆర్, హరీష్ రావు, కవిత అత్యవసర భేటీ !
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), ముఖ్య నాయకులు మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao), ఎమ్మెల్సీ కవిత(Kavitha)లు అత్యవసరంగా భేటీ (Emergency Meeting)అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), ముఖ్య నాయకులు మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao), ఎమ్మెల్సీ కవిత(Kavitha)లు అత్యవసరంగా భేటీ (Emergency Meeting)అయ్యారు. నందినగర్ నివాసంలో భేటీయైన కేటీఆర్, హరీష్ రావు, కవితలు తాజా రాజకీయ పరిస్థితులు, ఫార్ములా ఈ రేసు కేసులో పరిణామాలపై చర్చించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ కేసును కొట్టివేయాలంటూ, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో వారు లీగల్ టీమ్ తో భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.
క్వాష్ పిటిషన్ కొట్టివేయడం..ఈడీ విచారణకు కేటీఆర్ సమయం కోరడం..ఏసీబీ 9వ తేదీన విచారణకు హాజరుకావాలని ఇచ్చిన నోటీసులపై ఈ సందర్భంగా ముగ్గురు నాయకులు న్యాయవాదుల బృందంతో చర్చించారు. ఫార్ములా ఈ రేసు కేసులో తదుపరి ఏం చేయాలన్న దానిపై వారు కీలక కసరత్తులో మునిగారు. కేసులో కేటీఆర్ అరెస్టును అడ్డుకునేలా సుప్రీంకోర్టు తలుపు తట్టే ప్రతిపాదనపై కూడా యోచిస్తున్నారు.
బీఆర్ఎస్ ముఖ్య నేతలు ముగ్గురు కూడా చాల రోజుల తర్వాత అత్యవసరంగా ఒకచోట సమావేశం కావడంతో ఏం జరుతుందోనన్న ఉత్కంఠతో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో నందినగర్ వద్దకు చేరుకున్నారు.