ఆకలితో ఏది పడితే అది తింటున్నారా.. పక్షవాతంతో పాటు?
తినడానికి చాలా గ్యాప్ ఇచ్చాక ఆకలితో చాలా మంది కనిపించిదల్లా ఎగబడి మరీ తింటున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తినడానికి చాలా గ్యాప్ ఇచ్చాక ఆకలితో చాలా మంది కనిపించిదల్లా ఎగబడి మరీ తింటున్నారు. అయితే ఇలా ఏది పడితే అది తింటే.. అనారోగ్యాకి హాని కలుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అనారోగ్యకరమైన చిరుతిండ్లు(Unhealthy snacks) కడుపులో పడేయడం ద్వారా అనేక ప్రాణాంతక సమస్యలు(Life-threatening complications) తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. గుండె జబ్బులు(Heart disease), పక్షవాతం(stroke) ముప్పు పెరుగుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. చక్కెరలు అధికంగా(sugars) ఉన్న ఫుడ్స్.. అలాగే ప్రాసెస్ చేసిన చిరుతిండ్ల(Processed snacks)కు అలవాటు పడితే మీ అంతలా మీరే కొత్త రోగాలు కొనితెచ్చుకున్నవారు అవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్త అధ్యయనంలో అనారోగ్యకరమైన చిరు తిండ్లు అధిక బరువును సూచించే బాడీ మాస్ ఇండెక్స్(Body mass index) సడెన్‌గా పెరిగిపోతుంటాన్ని గుర్తించారు. వీటితో పాటుగా శరీరంలో కొవ్వు విపరీతం(Excessive fat )గా పేరుకుపోతుంది. చిరుతిండ్లు లాగించేస్తే.. రక్తంలో అధిక చక్కెర స్థాయిల ద్వారా గుండె సంబంధిత వ్యాధులు(Cardiac diseases), పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. కాగా అనారోగ్యకరమైన చిరుతిండ్లకు బదులు తాజా పండ్లు(Fresh fruits) లేత గింజలు తింటే సంపూర్థ ఆరోగ్యానికి మంచిదని.. అలాగే జీవక్రియ సాఫీగా ఉంటుందని అంటున్నారు. బిస్కెట్స్(Biscuits), కేకులు(Cakes), చిప్స్(Chips) వంటివాటికి దూరంగా ఉండి.. గింజల వైపు జీవనశైలిని మార్చుకోండని సూచిస్తున్నారు. పప్పు ధాన్యాలు(Pulses), ప్రోటీన్లు(Proteins), కూరగాయలు(vegetables) వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.