ఈ పొరపాటు చేస్తున్నారా.. 18 రకాల వ్యాధులు తలెత్తుతాయి..?
ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు జనాలు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు జనాలు. జీవన శైలిలో మార్పుల కారణంగా.. ఉద్యోగం రీత్యా బిజీ షెడ్యూల్ కారణంగా సరైన ఆహారం కూడా తీసుకోలేకపోతున్నారు. ఫోన్లలో గంటల తరబడి మునిగి తేలుతున్నారు. ఒక వృత్తి పరంగా ఒకే చోటు ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఆఫీసుల్లో పనిలో నిమగ్నమై కొన్ని గంటల పాటు అలాగే కూర్చుని పని చేస్తే మద్యపానం(Drinking), ధూమపానం(smoking) కన్నా డేంజరేస్ అని నిపుణులు చెబుతున్నారు. ఇలా కూర్చొని పని చేయడం వల్ల ఏకంగా 18 రకాల వ్యాధులు వస్తాయని అంటున్నారు. మరీ ఆ వ్యాధులేంటో ఇప్పుడు చూద్దాం..
ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు(Bad cholesterol levels) పెరుగుతాయి. అలాగే ఓస్టియోపోరోసిస్(Osteoporosis), జీవితం కాలం తగ్గిపోవడం, జీర్ణ సమస్యలు(Digestive problems), ఎనర్జీ లాస్ అవ్వడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం(Decreased immunity) జరుగుతుంది. వీటితో పాటుగా మేధో సంపత్తిని తగ్గించడం, మెదడులో పనితీరు మందగించడం, రక్త ప్రసరణ లోపం(Blood circulation deficiency), క్యాన్సర్(Cancer), శ్వాస వ్యవస్థపై దుష్ర్పభావం, మెడనొప్పి, మధుమేహం, మానసిక ఆరోగ్య సమస్యలు, శరీరంపై ఆధిపత్యం లేకపోవడం, పోషకపదార్థాల రహితమైన రక్తప్రసరణ తగ్గిపోవడం, హృదయ సంబంధిత వ్యాధులు(Cardiovascular diseases) తలెత్తడం, బరువు పెరగడం, అవయవాల్లో చురుకుదనం లోపం తగ్గడం వంటి సమస్యలు ఏర్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.
Read More...
Routines : మరుసటి రోజు మూడ్ బాగుండటం లేదా..? ఈ పొరపాట్లే కారణం కావచ్చు!