అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ అండ్ పీజి కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి పీజి కోర్సులో బోధించడానికి తెలుగు,జూవాలజీ,సబ్జెక్టు లకు,డిగ్రీ కోర్సులో బోధించడానికి పొలిటికల్ సైన్స్ (ఉర్దూ మీడియం) సబ్జెక్టులలో అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపాల్ అమీనా ముంతాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2025-01-06 15:11 GMT

దిశ,ప్రతినిధి,మహబూబ్ నగర్: ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ అండ్ పీజి కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి పీజి కోర్సులో బోధించడానికి తెలుగు,జూవాలజీ,సబ్జెక్టు లకు,డిగ్రీ కోర్సులో బోధించడానికి పొలిటికల్ సైన్స్ (ఉర్దూ మీడియం) సబ్జెక్టులలో అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపాల్ అమీనా ముంతాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పీజీ సబ్జెక్టులో 55 శాతం మార్కులు,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు.  నెట్,స్లెట్,సెట్,పీహెచ్డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఆమె తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు,అన్ని సర్టిఫికేట్ల జీరాక్సు కాపీలతో బుధవారం సాయంత్రం నాలుగు గంటల లోపు ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో మౌఖిక పరీక్ష కు హాజరు కావాలని,కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ తెలిపారు.


Similar News