డైనమిక్ ఎడిషన్లతో దిశ కొత్తదనాన్ని తీసుకొచ్చింది

నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ దిశ క్యాలెండర్ ని ఆవిష్కరణ చేశారు.

Update: 2025-01-06 15:18 GMT

దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ దిశ క్యాలెండర్ ని ఆవిష్కరణ చేశారు. దిశ వార్త పత్రిక నూతన ఒరవడిని చూపిస్తూ నేటి తరానికి అణుగుణంగా వార్తలు సేకరణ చేస్తూ..అందరికీ ఉపయోగపడే వార్తలు అప్పుడు అందిస్తుందన్నారు.  డైనమిక్ ఎడిషన్ లతో వార్త ప్రపంచంలో నూతన ఒరవడిని సృష్టించింది అన్నారు. ప్రజలకు అవసరం అయ్యే వార్తలను అందిస్తూ ఇంక ముందుకు వెళ్ళాలని కోరారు. ఈ కార్యక్రమం లో దిశ ఉమ్మడి నల్లగొండ బ్యూరో గాదె రమేష్,నల్లగొండ దిశ ఆర్సీ ఇంఛార్జి ఓడపల్లి మధు,నల్లగొండ క్రైమ్ రిపోర్టర్ జానీ,నల్లగొండ టౌన్ రిపోర్టర్ మధు పాల్గొన్నారు.


Similar News