నరాలు బలహీనంగా ఉన్నాయా? మీరు తినాల్సిన ఫుడ్స్ ఇవే..?
మానవ శరీరంలో నరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
దిశ, వెబ్‌డెస్క్: మానవ శరీరంలో నరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాంటిది నరాలు బలహీనంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయి. మెమోరీ లాస్ అవ్వడం, తిమ్మిర్లు రావడం, కండరాల బలం కోల్పోవడం, దీర్ఘకాలిక తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాగా నరాల బలహీనతకు చెక్ పెట్టడానికి ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
అంతేకాకుండడా ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలలో నరాలు బలానికి కావలసిన పోషకాలు దట్టంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ, ఫోలేట్, మెగ్నీషియం, రాగి, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి నరాలకు శక్తిని చేకూరుస్తాయని వైద్యులు చెబుతూనే ఉంటారు. వీటితో పాటు ఈ ఫుడ్స్‌తో నరాల బలం పెరుగుతుందని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సిట్రస్ పండ్లు..
నరాల బలానికి సిట్రస్ ఫ్రూట్స్ మేలు చేస్తాయి. నారింజ, నిమ్మ, బత్తాయి, గ్రేప్స్ వంటి పండ్లు సిట్రస్ జాతికి చెందినవే. సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉన్న ఫ్రూట్స్ ను సిట్రస్ పండ్లు అంటారు. వీటిలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, ఫైబర్, ప్లాంట్ కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఈ పండ్లు తింటే శరీరానికి కావాల్సిన ఇమ్మూనిటి పవర్ అందుతుంది. ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు నరాలు దెబ్బతినకుండా కీలక పాత్ర పోషిస్తాయి.
క్వినోవా..
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుండే క్వినోవా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో జింక్, మాంగనీస్, కాపర్, ఐరన్, విటమిన్, బి6 వంటివి దట్టంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ నరాల వీక్ నెస్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
బ్లూ బెర్రీ..
జ్ఞాపకశక్తి మెరుగుపర్చడంలో బ్లూ బెర్రీ పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. నరాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. బ్లూ బెర్రీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా మెండుగా ఉంటాయి.
గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజల ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ సీడ్స్ తింటే నరాల ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో పోషకాలు దట్టంగా ఉండటమే కాకుండా.. గుమ్మడి గింజల్లో విటమిన్ ఎ, బి, సి, ఈ, ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, జింక్, పొటాషియం, ఫినోలిక్ సమ్మేళనాలు, ఐరన్, ఫోలెన్, అమైనో యాసిడ్స్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. ఇవి నరాలను బలంగా ఉంచడంలో మేలు చేస్తాయి.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.