తల్లిదండ్రులు పిల్లల పట్ల స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నారా.. వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి?
కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తారు.
దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది తల్లిదండ్రులు పిల్లల(children) పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. దీంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పిల్లలను ప్రతిరోజూ ఏదో ఒక మాట అనడం వల్ల, తిట్టడం(scolding) వల్ల, కఠినంగా ప్రవర్తించడం వల్ల తమలో తాము అభద్రతా భావానికి లోన[ ఆత్మవిశ్వాసం(self confidence) తగ్గిపోతుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. అలాగే పిల్లలు తమకు ఇష్టమైన పనులు చేయడానికి వెనకడుగు వేస్తారు. పిల్లల భావాలను లేదా సృజనాత్మక పనులను చేయడానికి సంకోచించే పరిస్థితులు నెలకొంటాయి. దీంతో పిల్లలు కొత్తగా ఆలోచించలేరు. వారి సృజనాత్మకత(Creativity) అభివృద్ధి చెందదు.
తల్లిదండ్రులు కఠినంగా ప్రవర్తిస్తే కొంతమంది పిల్లలు వారి కఠినత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. పేరెంట్స్ మాట వినరు. మాట వినకపోవడం లేదా నియమాలు పాటించకపోవడం వంటివి చేస్తారు. క్రమశిక్షణ(discipline)గా ఉండే పిల్లలు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. తరచూ పేరెంట్స్ మీదనే ఆధారపడి ఉంటారు. పేరెంట్స్ అధిక నియంత్రణ ద్వారా పిల్లలు తమ ఇష్టాలను విస్మరిస్తారు. అలాగే పిల్లల్లో తరచూ భయం, ఆందోళన ఉంటుంది. దీంతో వారు మానసకంగా కుంగిపోతారు.
మానసిక ఆరోగ్యం(mental health)పై దెబ్బపడుతుంది. దీంతో పిల్లలు సంతోషంగా ఉండలేరు. తల్లిదండ్రులకు భయపడేవారు అబద్దాలు చెప్పడం ప్రారంభిస్తారు. ఎక్కువగా వాస్తవాలు దాచిపెడతారు. తల్లిదండ్రులు ఏమంటారో అనే భయం వారిలో ఉంటుంది. అందుకే వారి తప్పులను ఒప్పుకోకుండా నిజాన్ని దాస్తారు. ఇది పిల్లల నిజాయితీపై ప్రభావం పడుతుంది. తల్లిదండ్రులు పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తే భావోద్వేగాల లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా సంబంధాల్లో దూరం పెరుగుతుంది. పిల్లల్ని కఠినంగా పెంచే పిల్లల సంబంధం బలహీనం(weak)గా మారిపోతుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.