Fighting: రూ. 300 కోసం ఘర్షణ.. వ్యక్తి మృతి

రూ. 300 కోసం కొట్టుకున్న ఇద్దరిలో ఒకరి మృతి చెందారు..

Update: 2024-12-26 13:00 GMT

దిశ, వెబ్ డెస్క్: రూ. 300 కోసం ఇద్దరు వ్యక్తులు గొడవ పెట్టుకున్నారు. మాటా మాట పెరిగి కొట్టుకున్నారు. దాడిలో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా(Krishna District) పామర్రు మండలం చాట్లవానిపురం(Chatlavanipuram)లో జరిగింది. గ్రామానికి చెందిన సతీశ్(Satish), వెంకటేశ్వరరావు(Venkateswara rao) మంచి స్నేహితులు(Good Friends). డబ్బులు అవసరం పడి సతీశ్ వద్ద వెంకటేశ్వరరావు రూ. 300 తీసుకున్నారు. ఈ నెల 20న సాయంత్రం సమయంలో వెంకటేశ్వరరావును కలిసిన సతీశ్ తన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద లేవని, తర్వాత ఇస్తానని వెంకటేశ్వరరావు ఇందుకు బదులిచ్చారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి ఘర్షణగా మారింది. పరస్పరం బూతులు తిట్టుకున్నారు. విచక్షణ కోల్పోయిన వెంకటేశ్వరరావు కర్రతో సతీశ్ తలపై బలంగా కొట్టారు. దీంతో సతీశ్ అక్కడికక్కడే సృహకోల్పోయి కింద పడిపోయారు. స్థానికులు గమనించి సతీశ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సతీశ్ బుధవారం రాత్రి చనిపోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సతీశ్, వెంకటేశ్వరరావు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వివరాలను స్థానికుల సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వెంకటేశ్వరరావు కోసం గాలిస్తున్నారు. త్వరలోనే పట్టుకుని, కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News