Bridge Collapsed: కృష్ణా జిల్లాలో తప్పిన పెను ప్రమాదం

కృష్ణా జిల్లాలో తప్పిన పెను ప్రమాదం తప్పింది....

Update: 2024-12-26 11:52 GMT

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఈదల మద్దాలి(Edala Maddali) వద్ద ఒక్కసారిగా వంతెన(Bridge) కుప్ప కూలింది. అయితే బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్(Tractor) బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ వెనుకభాగం వంతెన కింద పారుతున్న నీటిలో కూరుకుపోయింది. ఇంజిన్ ముందు భాగం వంతెనపైనే ఉండటంతో ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పెదపారుపూడి మండలం(Pedaparupudi mandal ) నుంచి విజయవాడ(Vijayawada) వెళ్లే మార్గాన్ని ఇటీవల మూసివేశారు. దీంతో అత్యధిక వాహనదారులు నిత్యం ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగుస్తున్నారు. వంతెన నిర్మాణం శిథిలావస్థకు చేరిందని, మర్మమ్మతులు చేపట్టాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు కూలిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నూతన బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News