AP News : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. పోరస్ ప్రమాద బాధితులకు భారీగా ఎక్స్‌ గ్రేషియా

దిశ, ఏపీ బ్యూరో : పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘ‌ట‌న బాధాక‌ర‌మ‌ని హోంశాఖ మంత్రి తానేటి వ‌నిత అన్నారు.

Update: 2022-04-14 12:43 GMT

దిశ, ఏపీ బ్యూరో : పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘ‌ట‌న బాధాక‌ర‌మ‌ని హోంశాఖ మంత్రి తానేటి వ‌నిత అన్నారు. విజ‌య‌వాడ‌లోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి తానేటి వనిత, వైసీపీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరితో కలిసి పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితులను వైద్యులు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను క్షత‌గాత్రుల‌ను అడిగి తెలుసుకున్నారు. పోరస్ కెమిక‌ల్‌ ఫ్యాక్టరీ ప్రమాదంలో గాయ‌ప‌డిన వారి ప‌రిస్థితి విషమంగానే ఉంద‌ని, క్షత‌గాత్రుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తున్నామ‌ని చెప్పారు. అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాల‌కు ప్రభుత్వం తరపున రూ.25 ల‌క్షల పరిహారాన్ని సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్రక‌టించార‌ని చెప్పుకొచ్చారు.

అలాగే ఫ్యాక్టరీ యాజ‌మాన్యం నుంచి మ‌రో రూ.25 ల‌క్షలు.. మృతుల కుటుంబాలకు మొత్తం రూ.50 ల‌క్షల చొప్పున పరిహారం అందుతుందని చెప్పుకొచ్చారు. పోర‌స్ కెమిక‌ల్ ఫ్యాక్టరీ వ‌ల్ల స‌మ‌స్యలు వ‌స్తున్నాయ‌ని.. కెమిక‌ల్స్ నీటిలో క‌ల‌వ‌డం వ‌ల్ల ర‌క‌ర‌కాల వ్యాధులకు గుర‌వుతున్నామ‌ని చెప్పుకొచ్చారు. ఫ్యాక్టరీ నివాసాల స‌మీపంలో ఉండొద్దని స్థానికులు కోరుతున్నార‌ని.. దీనిపై కూడా విచార‌ణ జ‌రిపిస్తామ‌ని హోంమంత్రి తానేటి వ‌నిత చెప్పుకొచ్చారు. పోర‌స్ ఫ్యాక్టరీని సీజ్ చేయ‌డానికి సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆదేశాలిచ్చార‌ని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి క‌ల్పించే ఫ్యాక్టరీలను మాత్రమే ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని...ఇలాంటి హాని క‌లిగించే ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించదని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.

Tags:    

Similar News